టీఆర్ఎస్ పార్టీ ప్రకటన సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్‌ని ‘మర మనిషి’ అంటూ విమర్శించారు. ఆమె ఆవిధంగా సొంత తండ్రిని విమర్శించడాన్ని కాంగ్రెస్, బిజేపి నేతలు కూడా తప్పు పట్టారు.
నేడు తాజా ఇంటర్వ్యూలో ఆమె వారికి సమాధానమిస్తూ, “నేను నా తండ్రి కేసీఆర్‌ని విమర్శించలేదు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలిగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ని విమర్శించాను. అది వ్యక్తిగతం కాదు. రాజకీయంగానే.
ఇక ముందు కూడా ఆయన రాజకీయ తప్పిదాలను విమర్శిస్తాను. అలాగే నేను తప్పులు చేస్తే ఆయనతో సహా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా నన్ను విమర్శించవచ్చు. నా తప్పులు సరిదిద్దుకోవడానికి నేను ఎన్నడూ సిగ్గుపడను.
నాకు నా తండ్రి కేసీఆర్‌తో ఎటువంటి సమస్యలు లేవు. ఆయన నాకు జన్మనిచ్చిన తండ్రి. ఆయన వల్లనే నేనున్నాను. ఆయనే లేకపోతే నాకు ఈ జన్మ ఉండేదే కాదు. దేవుడిపై భక్తి శ్రద్దలు కలిగిన ఓ హిందూ మహిళగా ప్రతీరోజూ నేను పూజాగదిలో కూర్చొని చదివే మంత్రాలలో తప్పనిసరిగా నా తల్లితండ్రుల పేర్లు కూడా ఉంటాయి,” అని అన్నారు.
ఆమె మాటలు సహేతుకంగానే ఉన్నప్పటికీ సామాన్య, గ్రామీణ ప్రజలు ఆమె తర్కాన్ని అర్థం చేసుకోకపోవచ్చు. కనుక కేసీఆర్ గురించి ఆమె తప్పుగా మాట్లాడే ప్రతీమాట ఆమెని ప్రజలకు దూరం చేస్తుందని మరిచిపోకూడదు.

"నేను మా నాన్నను వ్యతిరేకించలేదు.. ఆయన లేకపోతే నాకు జన్మ లేదు.

నేను వ్యతిరేకించింది రాజకీయ నాయకుడు, BRS అధ్యక్షుడిని మాత్రమే."

– #Kavitha pic.twitter.com/Xl6gNuiLLQ
— Gulte (@GulteOfficial) May 2, 2026

(Video Source: Gulte)