నాగ చైతన్య-సమంత విడిపోయి అప్పుడే మూడేళ్ళు పైనే అవుతోంది. వారిలో నాగ చైతన్య శోభితా ధూళిపాళని పెళ్ళి చేసుకోగా, సమంత దర్శకుడు రాజ్ నిడిమోరుని పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య-సమంత విడిపోయిన తర్వాత మళ్ళీ ఇంతవరకు ఒకరినొకరు కలవలేదు.
తొలిసారిగా శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఏషియన్ గ్రూప్ అధినేత ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రాన్ పెళ్ళి రెసిప్షన్‌లో నాగ చైతన్య, సమంత తమతమ జీవిత భాగస్వాములతో కలిసి వచ్చారు.
సినీ పరిశ్రమ విడాకులు, రెండో పెళ్ళిళ్ళు సర్వసాధారణమైన విషయమే. కానీ అన్యోన్యంగా జీవిస్తున్న నాగ చైతన్య, సమంత ఆకస్మికంగా విడిపోవడం అభిమానులకు పెద్ద షాక్ అనే చెప్పాలి.
ఆ తర్వాత నాగ చైతన్యపై సమంత కొన్ని వ్యక్తిగత విమర్శలు చేసినప్పటికీ అతను పట్టించుకోకపోవడంతో క్రమంగా వారి వ్యవహారం సద్దుమణిగింది. ఇద్దరూ తమకు నచ్చినవారిని పెళ్ళిళ్ళు చేసుకొని హాయిగా జీవిస్తూ, సినిమాలు చేసుకుంటూ మళ్ళీ గాడిలో పడ్డారు.
కనుక ప్రజలు కూడా వారి పెళ్ళి, విడాకుల సంగతి మరిచిపోయారు. మళ్ళీ ఇంతకాలానికి ఇద్దరూ ఒకే పార్టీలో కనిపించడంతో అందరి దృష్టిని ఆకర్షించారు.
నాగ చైతన్య ప్రస్తుతం కార్తీక దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’ చేస్తుండగా, నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత ‘మా ఇంటి బంగారం’ చేస్తున్నారు. వీటిలో మా ఇంటి బంగారం మే 15న విడుదల కావాల్సి ఉండగా జూన్ 4కి వాయిదా పడినట్లు తెలుస్తోంది. వృషకర్మ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.