కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ప్రధానపాత్రలలో సిద్ధం చేసిన పోలీస్ కంప్లెయింట్ ఈ నెల 22న విడుదల కాబోతోంది. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలో రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం, రవిశంకర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్ రమేష్ ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాలో కృష్ణసాయి ఓ ప్రత్యేక పాత్ర చేశారు. ఈరోజు అతని పుట్టినరోజు సందర్భంగా అలనాటి మేటి నటుడు సూపర్ స్టార్ కృష్ణపై ఈ సినిమా కోసం చేసిన స్పెషల్ సాంగ్ విడుదల చేశారు.
ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించిన ఈ సినిమాకి ముగ్గురు సంగీత దర్శకులు పనిచేశారు. ఆరోహణ సుధీంద్ర, సంజీవ్ మేగోటి, సుధాకర్ మారియో పాటలకు సంగీతం అందించగా, దర్శకుడు సంజీవ్ మేగోటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చేశారు. ఈ సినిమాకి కెమెరా: ఎస్.ఎన్.హరీష్ సొండెకొప్ప, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్ చేశారు.