ఆహా.. ఓటీటీలో తిమ్మరాజుపల్లి టీవీ

May 07, 2026


img

ప్రముఖ నటుడు కిరణ్ అబ్బవరం నిర్మాతగా వి.మునిరాజు దర్శకత్వంలో తీసిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ గత నెల థియేటర్లలో విడుదలై పర్వాలేదనిపించుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఈ నెల 15 నుంచి ఆహా ఓటీటీలో ప్రసారం కాబోతోంది. 

సినిమాటోగ్రాఫర్ సాయి తేజ ఈ సినిమాలో హీరోగా, వేద జలందర్ (వేదశ్రీ) హీరోయిన్‌గా నటించారు. 

ఈ సినిమాలో ప్రదీప్ కొట్టే, స్వాతి కరీంరెడ్డి, అమ్మ రమేష్, వడ్డాది సత్యనారాయణ, తేజ విహాన్, టీవీ రామన్, మాధవి ప్రసాద్, చిట్టిబాబు, అన్షుమన్, లతీష్ కీలపట్టు ముఖ్యపాత్రలు చేశారు. 

వి.మునిరాజు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కథ క్లుప్తంగా... 1990వ దశకంలో టీవీలు గ్రామీణ ప్రాంతాలకు వస్తున్న సమయంలో జరిగిన కథ ఇది. రాజప్ప (ప్రదీప్ కొట్టె) టీవీ కొని ఇంటికి తెస్తాడు. చిల్లర దొంగతనాలు చేసే సతీష్ (సాయి తేజ్) కూడా టీవీ చూసేందుకు వస్తుంటాడు.

అప్పుడు మెల్లగా రాజప్ప చెల్లి శారద (వేద జలందర్)తో పరిచయం ఏర్పడి ఇద్దరూ ప్రేమలో పడతారు. వారి ప్రేమ విషయం రాజప్పకి తెలియడంతో సతీష్ ని అవమానించి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు.

ఆ టీవీ లేకుండా చేస్తానని శపథం చేసి సతీష్ వెళ్ళిపోతాడు. అదే రోజు రాత్రి టీవీ దొంగతనం అవుతుంది. సతీష్ దొంగతనం చేశాడని ఊళ్ళో అందరూ భావిస్తారు. తర్వాత కథ  తిమ్మరాజుపల్లి టీవీ చూసి తెలుసుకోవాల్సిందే! 


Related Post

సినిమా స‌మీక్ష