రేవంత్ ‘సర్’ అప్రమత్తమయ్యారు!

May 09, 2026


img

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్) పేరుతో ఏకంగా 93 లక్షలకు పైగా నకిలీ ఓటర్లను ఈసీ తొలగించింది. అది ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర ఆ ప్రభావం చూపింది.

కేంద్రం ఒత్తిడితో ఈసీ సర్ పేరుతో తమ పార్టీకి మద్దతు ఇచ్చే ఓటర్ల పేర్లను తొలగించడం వల్లనే తాము ఓడిపోయాము తప్ప ప్రజలు తిరస్కరించడం వల్ల కాదని మాజీ సిఎం మమతా బెనర్జీ ఆరోపించారు.

పశ్చిమ బెంగాల్ తర్వాత బిజేపి టార్గెట్ తెలంగాణ రాష్ట్రమేనని రాష్ట్ర బిజేపి నేతలు బహిరంగంగానే చెపుతున్నారు. కనుక సిఎం రేవంత్ రెడ్డి అప్రమత్తమయ్యారు. 

శుక్రవారం నాంపల్లి హజ్ హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “పశ్చిమ బెంగాల్లో సర్ పేరుతో లక్షల కొద్దీ ఓటర్లను తొలగించి బిజేపి దొడ్డిదోవలో ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కానీ తెలంగాణలో సర్ పేరుతో ఓటర్లను తొలగించేందుకు చేసే ప్రయత్నాలను అడ్డుకుంటాను.కర్ణాటక, కేరళ, తెలంగాణ రాష్ట్రాలలో బిజేపి అధికారంలోకి రాకుండా కాంగ్రెస్‌ పార్టీ అడ్డుకున్నాను. ఇక ముందు కూడా అడ్డుకుంటాను.  

తెలంగాణలో హిందూ ముస్లింలు కలిసి మెలిసి జీవిస్తున్నారు. కనుక మతతత్వ బిజేపి రాకుండా అడ్డుకోవడానికి అందరం కలిసి గట్టిగా కృషి చేస్తాము. బీఆర్ఎస్‌ పార్టీ నాయకులు ఎవరెవరితో రహస్య మంతనాలు చేస్తున్నారో అందరికీ తెలుసు. బిజేపి, బీఆర్ఎస్‌ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో వాటిని అధికారంలోకి రానీయను,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. 


Related Post