మల్కాపూర్ చమురు నిలువ టెర్మినల్.. రేపే ప్రారంభోత్సవం

May 09, 2026


img

ప్రధాని మోడీ రేపు (అదివారం) హైదరాబాద్‌ వస్తున్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగబోయే బహిరంగ సభ వేదిక మీద నుంచే రూ.9,000 కోట్లు వ్యయంతో రాష్ట్రంలో నిర్మించిన, ఇక ముందు నిర్మించబోతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 

వాటిలో మల్కాపూర్ వద్ద రూ.611 కోట్లు వ్యయంతో 89 ఎకరాల విస్తీర్ణంలో కొత్తగా నిర్మించిన భారీ చమురు నిలువ టెర్మినల్ కూడా ఒకటి. దేశంలో చమురు సంక్షోభం నివారించేందుకుగాను అన్ని రాష్ట్రాలలో ఇటువంటి భారీ టెర్మినల్స్ కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. 

మల్కాపూర్ టెర్మినల్లో పెట్రోల్: 60,000 కిలో లీటర్లు, డీజిల్ 68,000 కిలో లీటర్లు, విమాన ఇంధనం: 26,000 కిలో లీటర్లు, ఇతర ఇంధనాలు 11,000 కిలో లీటర్లు కలిపి మొత్తం 1,65,000 కిలో లీటర్లు నిలువ సామర్ధ్యంతో నిర్మించారు. దీనికీ ప్రధాని మోడీ రేపు ప్రారంభోత్సవం చేయబోతున్నారు... అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.  



Related Post