రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘వారణాశి’ 2027, ఏప్రిల్ 7వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పుడే మే నెల సగం అయిపొయింది. అంటే మరో 11 నెలలు సమయం మాత్రమే మిగిలి ఉందన్నమాట!
ఇది రూ.1,100 కోట్ల భారీ బడ్జెట్ అంతర్జాతీయ స్థాయి సినిమా కనుక 11 నెలల్లో అన్ని పనులు పూర్తిచేసి చెప్పిన సమయానికి రిలీజ్ చేయాలంటే చాలా వేగంగా షూటింగ్ పనులు జరపాల్సి ఉంటుంది. షూటింగ్ 50 శాతం పైగా పూర్తయినట్లు సమాచారం.
మంగళవారం నుంచి మొదలయ్యే తదుపరి షెడ్యూల్లో మహేష్ బాబు పాల్గొని ఏకధాటిగా రెండు నెలలు షూటింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రిగా ప్రకాష్ రాజ్, విలన్ కుంభగా పృద్విరాజ్ సుకుమారన్, మందాకినిగా బాలీవుడ్ సీనియర్ నటి ప్రియాంకా చొప్రా నటిస్తున్నారు.
ఈ సినిమాకి కధ: విజయేంద్ర ప్రసాద్, డైలాగ్స్: దేవకట్ట, సంగీతం: ఎంఎం కీరవాణి, కెమెరా: ఎస్.గోపాల్ రెడ్డి, పిఎస్ వినోద్,వీఎఫ్ఎక్స్: శ్రీనివాస్ మోహన్, సందీప్ కమల్, మోహన్ నాథ్ బింగి చేస్తున్నారు.
ఆర్ట్: సందీప్ సువర్ణ, ఎడిటింగ్: బిక్కిన తమ్మరాజు, స్టంట్స్: కింగ్ సోలోమన్, లైన్ ప్రొడ్యూసర్: ఎంఎం శ్రీవల్లి, కాస్ట్యూమ్స్: రమ రాజమౌళి, ఎస్ఎస్ కార్తికేయ: ప్రొడక్షన్ మేనేజ్ మెంట్ చేస్తున్నారు.
శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ కలిసి సుమారు రూ.1,100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న వారణాశి ప్రేక్షకుల ముందుకు వస్తుంది.