మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో ఐటెం సాంగ్‌కు డాన్స్ చేసిన మౌనీరాయ్ భర్త నుంచి విడిపోబోతున్నారా? అంటే అవుననే అనుకోవాలి. ఆమె తన భర్త సూరజ్ నంబియార్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ ఫాలో చేసి తన ఫోటోలు మాత్రమే పోస్ట్ చేస్తున్నారు.
ఆమె భర్త సూరజ్ కూడా భార్య మౌనీ రాయ్‌ని అన్ ఫాలో చేసి, తమ పెళ్ళి ఫొటోలన్నీ డిలీట్ చేశారు. త్వరలో వారిద్దరూ విడిపోబోతున్నారని సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. కానీ వారిద్దరూ వాటిని ఖండించడం లేదు. కనుక త్వరలోనే “పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నాం... మా వ్యక్తిగతస్వేచ్చని గౌరవించండి,” అంటూ ఇద్దరూ సోషల్ మీడియాలో బాంబు పేలుస్తారేమో?
సూరజ్ నంబియార్, మౌనీ రాయ్ ఇద్దరూ ప్రేమించుకొని 2022 జనవరిలో అట్టహసంగా గోవాలో పెళ్ళిచేసుకున్నారు. కానీ నాలుగు గడిచేసరికి విడాకుల వరకు వచ్చేయడం నిజమే అయితే చాలా బాధాకరమే.