తమిళనాడు సిఎం విజయ్ అప్పుడే తప్పటడుగు వేసి తీవ్ర విమర్శల పాలవుతున్నారు. తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రిక్కీ రాధన్ పండిట్‌ని సిఎం ఓఎస్‌డీ (పొలిటికల్)గా నియమించుకున్నారు. ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేయగానే దానిని సోషల్ మీడియాలో పెట్టి పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తమిళనాడు రాజకీయాలలో, పాలనలో విజయ్ ఏదో కొత్త ట్రెండ్ సృష్టిస్తాడనుకుంటే ఆయన కూడా అప్పుడే ఇలా మొదలుపెట్టేశారా?అని విమర్శిస్తున్నారు.
విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత తీవ్ర భావోద్వేగంతో చేసిన ప్రసంగంలో తాను బంధు ప్రీతికి దూరంగా ఉంటానని ప్రజాధనం దుబార చేయనన్నారు. కానీ సిఎంగా బాధ్యతలు చేపట్టిన రోజే తన జ్యోతిష్యుడుని క్యాబినెట్ హోదాతో ఓఎస్‌డీగా నియమించుకున్నారని మాట తప్పారని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినీ నటి త్రిషని డెప్యూటీ సిఎంగా నియమిస్తారని ఊహాగానాలు వినిపించాయి. కానీ నియమించలేదు. ఒకవేళ నియమించి ఉంటే అప్పుడే విమర్శలు మొదలైపోయేవి.