బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా చేస్తున్న ‘పెద్ది’పై చాలా భారీ అంచనాలే ఉన్నాయి. కనుక అందరూ జూన్ 4న విడుదల కాబోయే పెద్ది కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ట్రైలర్‌కి కూడా ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల 18న ముంబాయిలో పెద్ది ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. అది కూడా అద్భుతంగా ఉంది.
పెద్ది ‘స్పెషల్ సాంగ్’ ఈ నెల 23న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూ విడుదల చేసిన వీడియో కూడా అద్భుతంగా ఉంది.
పెద్దిని మొదట గ్రామీణ క్రికెటర్‌గా పరిచయం చేసిన బుచ్చిబాబు ఆ తర్వాత హటాత్తుగా కండలు తిరిగిన శరీరంతో గద పట్టుకొని నిలబడిన ‘పెద్ది పహిల్వాన్’గా చూపడంతో ఒక్కసారిగా పెద్దిపై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. అందువల్లే ఉత్తర అమెరికాలో పెద్ది అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్, కోచ్ గౌరు నాయుడుగా శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. జగపతి బాబు, శివ రాజ్ కుమార్, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.
వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించిన పెద్ది జూన్ 4న విడుదల ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.