తమిళనాడు సిఎంగా విజయ్ బాధ్యతలు చేపట్టగానే తన జ్యోష్యుడు తిరు ఆర్ఆర్ రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్‌ని సిఎం ఓఎస్‌డీ (పాలిటిక్స్)గా నియమించుకున్నారు.
దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో నేడు శాసనసభలో బలనిరూపణ చేసుకున్న తర్వాత తన నిర్ణయాన్ని పునః సమీక్షిస్తానని చెప్పారు.
చెప్పినట్లుగానే తమిళనాడు ప్రభుత్వం జీవో జారీ చేసింది. దానిలో రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్ నియమిస్తూ ముందు జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించింది. దీంతో మొన్న విమర్శించినవారు సైతం సిఎం విజయ్‌ని ఇప్పుడు ప్రశంశిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో గత ప్రభుత్వాలు, ఇప్పటి ప్రభుత్వాలు కూడా ఎన్ని విమర్శలు వస్తున్నా పట్టించుకోకుండా అసమదీయులను ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకొని ఉపాధి, జీతభత్యాలు కల్పిస్తున్నాయి.
తప్పులు చేయడం సహజం. కానీ అది తప్పని తెలిసినప్పుడు కూడా సరిదిద్దుకోకపోవడం పెద్ద తప్పు. కానీ విజయ్ ప్రభుత్వం తొలి పొరపాటుని విమర్శలు వినిపించగానే భేషజానికి పోకుండా సరిదిద్దుకుంది.