తెలంగాణ మహిళా కమీషన్ చైర్ పర్సన్‌గా విజయలక్ష్మి

May 12, 2026


img

జిహెచ్‌ఎంసి మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి  తెలంగాణ మహిళా కమీషన్ చైర్ పర్సన్‌గా నియమితులయ్యారు. ఆమెతో పాటు మరో ఆరుగురు సభ్యులను కూడా ప్రభుత్వం నియమించింది. తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి..  తల్లి శంకరమ్మకు కూడా కమీషన్‌ సభ్యురాలిగా నియమితులయ్యారు.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ రామకృష్ణారావు  నేడు ఉత్తర్వులు జారీ చేశారు. కమీషన్ ఇతర సభ్యుల పేర్లు: చిట్యాల శ్వేత, శశికళ యాదవ రెడ్డి, ఉజ్మా ఆషాయ్‌ షకీరా, సదాలక్ష్మి, ఎన్. రాదాభాయి. వీరందరూ 5 ఏళ్ళు ఈ పదవుల్లో కొనసాగుతారని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

గద్వాల్ విజయలక్ష్మి మర్యాదపూర్వకంగా సిఎం రేవంత్ రెడ్డిని కలిసి తనని ఈ పదవికి ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. రాష్ట్రంలో మహిళల రక్షణ, హక్కులని కాపాడేందుకు తాను, కమీషన్ సభ్యులు చిత్తశుద్ధితో కృషి చేస్తామని హామీ ఇచ్చారు.


Related Post