టాలీవుడ్‌ పర్సంటేజ్ సమస్యకి పరిష్కారం ఇలా...

May 15, 2026


img

గత పది రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతలకు, ఎగ్జిబిటర్స్ (సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు)కు మద్య టికెట్స్ ఆదాయాన్ని పర్సంటేజ్ విధానంలో పంచుకోవడంపై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇరు వర్గాలు వెనక్కు తగ్గకపోవడంతో తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు చొరవ తీసుకొని నేడు ఇరువర్గాలతో ఫిలిం ఛాంబర్లో సమావేశమయ్యారు. అప్పుడు కూడా ఇరువర్గాల మద్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరగడంతో ఈ సమస్య మరింత జటిలంగా మారింది. 

చివరికి సురేష్ బాబు కలుగజేసుకొని నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో ఓ కమిటీ ఏర్పాటు చేసుకుందామని సూచించగా అందరూ అంగీకరించారు. ఈ మూడు వర్గాల నుంచి ఐదుగురు చొప్పున మొత్తం 15 మందితో కమిటీ ఏర్పాటవుతుంది. ఈ కమిటీ అన్ని అంశాలు, సమస్యలపై చర్చింఛి రెండు నెలల్లోగా సిఫార్సులతో కూడిన నివేదిక ఫిలిం ఛాంబర్‌కి సమర్పించాల్సి ఉంటుంది. 

అంతవరకు పాత పద్దతిలోనే సినిమాల ప్రదర్శన, దానికి చెల్లింపులు జరుగుతాయి. జూన్‌ 4న విడుదల కాబోతున్న పెద్దితో సహా పెద్ద సినిమాల టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తే వాటిని ఎగ్జిబిటర్లు అమలుచేయాలని అందరూ అంగీకరించారు. కనుక భారీ అంచనాలతో విడుదలవుతున్న పెద్దికి లైన్ క్లియర్ అయిపోయినట్లే!  


Related Post

సినిమా స‌మీక్ష