పేరే వెరైటీగా ‘మేము కాప్‌లం’ అని పెట్టారు. అంటే ‘మేము కాపులం అని చెప్తున్నారా?’ అని సందేహం కలుగుతుంది. అవునో కాదో ట్రైలర్ చూస్తే అర్థమవుతుందనుకుంటే ‘సలార్ రాజు కిడ్నాప్... పోలీసుల గాలింపు’ అంటూ మరో ట్విస్ట్.
ఇంతకీ ఈ సలార్ రాజు ఎవరంటే ఈ సినిమాలో ముఖ్యపాత్ర చేస్తున్న నాగబాబు పెంచుకుంటున్న పందెం కోడి. సరిగ్గా సంక్రాంతి పందాల ముందు సలార్ రాజు కిడ్నాప్ అవుతాడు.
కనుక పోలీసులు ఎంట్రీ ఇస్తారు. సలార్ రాజు కిడ్నాప్ అయ్యాడని కేసు నమోదు చేసుకొని ‘క్రైమ్ సీన్ రిక్రేయేషన్’ అంటూ చేసే హడావుడి ట్రైలర్‌లో చూడాల్సిందే.
ఈ వెబ్ సిరీస్‌లో గెటప్ శ్రీను, రవితేజ నన్నిమాలం రీతు చౌదరి, చరణ్ లక్కరాజు, సిరి పార్వతి, కీర్తి దామరాజు తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
కధ: శోభన్ చిట్టుప్రోలు, దర్శకత్వం: ప్రదీప్ మద్దలి, సంగీతం: సాకేత్ కొమాండూరి, కెమెరా: కిషోర్ బోయిదాపు, డైలాగ్స్: శోభన్ చిట్టుప్రోలు,చానకి వర్మ, గోపాల కృష్ణ విద్మహే, ఎడిటింగ్:మైకేల్ డిసల్వ చేశారు.
రా ఎంటర్‌టైన్మెంట్స్, ప్రదీప్ మద్దలి క్రియేటివ్ బ్యానర్లపై బీవీఎస్. రవి, కౌమది కలిసి నిర్మించిన ఈ వెబ్ సిరీస్ జీ5 తెలుగు ఓటీటీలో ఈ నెల 22 నుంచి ప్రసారం కాబోతోంది.