రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’లో ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ పెద్ది కోచ్ ‘గౌరు నాయుడు’గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పెద్ది (రామ్ చరణ్) గ్రామీణ క్రికెటర్‌గా, పహిల్వాన్‌గా కూడా చేశారు. రెండు భిన్నమైన క్రీడలను దర్శకుడు బుచ్చిబాబు ఈ కథలో కోసం ఏవిధంగా కలిపి వాడుకున్నారో తెలియాలంటే ఈ నెల 18న ట్రైలర్ విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.
ఈ సినిమాలో శివరాజ్ కుమార్ పెద్దికి కుస్తీలో శిక్షణ ఇచ్చినట్లు సూచిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. దానిలో ఆయన వద్ద కుస్తీ శిక్షణ పొందిన శిష్యులతో పాటు పెద్దిని కూడా చూపారు.
ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా జాహ్నవీ కపూర్ నటించగా జగపతి బాబు, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.
వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు దీనిని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మించి జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.
Gournaidu a.k.a @nimmashivanna garu❤️🔥❤️🔥
— PEDDI (@PeddiMovieOffl) May 14, 2026
Step into the raw world of #PEDDI#PEDDITrailer in 4 days 🔥
Peddi in cinemas worldwide on 4th June.#GetReadyForPeddi 💥💥 pic.twitter.com/bZDwmdoQNq