బుచ్చిబాబు దర్శకత్వం రామ్ చరణ్ గ్రామీణ క్రికెటర్ మరియు పహిల్వాన్‌గా నటిస్తున్న ‘పెద్ది’ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ముందుగా ఈ నెల 18న ముంబాయిలో ట్రైలర్, తర్వాత 23న భోపాల్‌లో స్పెషల్ సాంగ్ విడుదల చేసేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఆలోగా పెద్దిలో ముఖ్యపాత్రలు చేసిన ఒక్కో నటుడిని, వారి పాత్రలను పరిచయం చేస్తూ వరుసగా వీడియోలు వదులుతున్నారు. ఈ సినిమాలో కుస్తీ శిక్షణ ఇచ్చే గురువు గౌరునాయుడుగా నటిస్తున్న శివరాజ్ కుమార్ పాత్రని పరిచయం చేస్తూ ఓ వీడియో వదిలారు.
కొన్ని గంటల వ్యవధిలో మళ్ళీ 'రామ్ బుజ్జీకి హాయ్ చెప్పడంటూ' హిందీ నటుడు దివ్యేందుని క్రికెటర్‌గా పరిచయం చేస్తూ మరో వీడియో వదిలారు.
ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్, కోచ్ గౌరు నాయుడుగా శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. జగపతి బాబు, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.
వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించిన పెద్ది జూన్ 4న విడుదల ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
Say Hi to #Rambujji 💥
— Mythri Movie Makers (@MythriOfficial) May 15, 2026
The GAME is about to start!
Watch @divyenndu in the world of #PEDDI ❤️🔥#PEDDITrailer from May 18th 🔥
Peddi in cinemas worldwide on 4th June.#GetReadyForPeddi 💥💥
Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman… pic.twitter.com/m2DdPk1rVv