అందరూ పెద్ద సినిమాల గురించి మాట్లాడుకుంటూ బిజీగా ఉన్నప్పుడు హటాత్తుగా చిన్న సినిమాల టీజర్లు, ట్రైలర్లు విడుదలవుతూ ఆశ్చర్యపరుస్తుంటాయి. అదేవిధంగా అందరూ ‘పెద్ది’ గురించి మాట్లాడుకుంటుంటే, ‘మరీచిక’ ట్రైలర్ విడుదలైంది.
సతీష్ కాశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన మరీచికలో విరాజ్ అశ్విన్, అనుపమ పరమేశ్వరన్, రెజీనా కాసండ్ర ముఖ్య పాత్రలు చేశారు. ఇవాళ్ళ ట్రైలర్ విడుదల చేశారు. ఇది ఓ ముక్కోణపు ప్రేమ కథ అయినప్పటికీ ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు దర్శకుడు.
హీరో హత్యకు గురవుతాడు. అది హత్యా ఆత్మహత్యా తెలీని పరిస్థితి. కానీ ముగ్గురు ప్రేమికులు ఒకరికొకరు పరిచయమే లేదన్నట్లు ట్రైలర్‌లో మరో ట్విస్ట్ ఇచ్చి ఇది జస్ట్ రొటీన్ రొమాంటిక్ మూవీ కాదు.. క్రైమ్-సస్పెన్స్-థ్రిల్లర్ అని ట్రైలర్‌తోనే చెప్పేశారు సతీష్ కాశెట్టి.
ఈ సినిమాకి కథ, డైలాగ్స్, పాటలు: లక్ష్మి భూపాల, సంగీతం: ఇళయరాజా, కెమెరా: అరవింద్ కన్నాభిరన్, ఆర్ట్: విట్టల్ కొసనం, ఎడిటింగ్: జునైద్ సిద్దిఖి చేశారు.
చిలక ప్రొడక్షన్స్, లక్ష్మి భూపాల ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై రాజీవ్ చిలక, మేఘా చిలక కలిసి నిర్మించిన మరీచిక ఈ నెల 29న విడుదల కాబోతోంది.