బండి భగీరథ్‌ పేరిట లుకవుట్ నోటీస్

May 16, 2026


img

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌ పేరిట సైబరాబాద్ పోలీసులు నేడు లుకవుట్ నోటీస్ జరీ చేశారు. హైకోర్టు అతనికి ముందస్తు బెయిల్‌, అరెస్ట్ చేయకుండా పోలీసులకు ఆదేశాలు జారీ చేసేందుకు నిరాకరించడంతో పోలీసులు వెంటనే రంగంలో దిగారు. బండి భగీరథ్‌ ఆచూకీ కనిపెట్టేందుకు 5 పోలీస్ బృందాలు ఏర్పాటు చేశారు.

వారు కరీంనగర్‌లోని బండి సంజయ్‌ ఇంటితో సహా వారి బంధుమిత్రుల ఇళ్ళకు వెళ్ళి సోదాలు చేస్తున్నారు. నోటీస్ ఇచ్చినప్పుడు తనంతట తానుగా విచారణకు హాజరు కాలేదు కనుక ఇప్పుడు పట్టుబడితే బండి భగీరథ్‌ని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

ఆవిధంగా జరిగితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి అది చాలా అవమానం, అప్రదిష్ట కనుక ఆయనే కొడుకు బండి భగీరథ్‌ని పోలీసులకు లొంగిపొమ్మని చెప్పినట్లయితే ఈరోజు సాయంత్రంలోగా లొంగిపోయే అవకాశం ఉంది.


Related Post