గుడ్ బై చెన్నై... గుడ్ బై జయం రవి: సింగర్ కెనిషా

May 16, 2026


img

ప్రపంచంలో ఏ సినీ పరిశ్రమలోనైనా నటీనటుల మద్య స్నేహాలు, రిలేషన్‌షిప్స్, బ్రేకప్స్, రెండో పెళ్ళిళ్ళు సర్వసాధారణమే.

అలాగే కోలీవుడ్‌ నటుడు జయం రవి (రవి మోహన్) కూడా సింగర్ కెనిషాతో ప్రేమలో పడ్డారు. అప్పటికే అతనికి భార్య ఆర్తి ఉంది. కానీ 2024లో ఆమెతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి ఆమెకు, అభిమానులకు కూడా పెద్ద షాక్ ఇచ్చారు.

ఇప్పుడు సింగర్ కెనిషా బ్రేకప్ చెప్పి అతనికి పెద్ద షాక్ ఇచ్చింది. ఆమె కోసం కట్టుకున్న భార్యని వదులుకుంటే చివరికి ఆమె కూడా అతనిని వదిలేసిందన్న మాట! 

అయితే ఇందుకు ఆమె జయం రవిని నిందించడం లేదు. మీడియాని, సోషల్ మీడియాని నిందిస్తూ మళ్ళీ సోషల్ మీడియాలోనే పెద్ద పోస్ట్ పెట్టారు. సోషల్ మీడియాలో ఈ వేధింపులు ట్రోలింగ్ భరించలేకపోతున్నానని, వాటితో తన మనసు ముక్కలు ముక్కలైపోయిందన్నారు. 

ఈ సమాజంలో మనుషులు అబద్దాలని కట్టుకథలనే అందరూ నమ్ముతారు. ఈ సమాజం అబద్దాలు చెప్పేవారు, కుతంత్రాలు చేసేవారే ఎక్కువగా ఉన్నారు. అటువంటి వారందరూ కలిసి సమాజంలో మంచిని, మంచి మనుషులను చంపేసే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.

 ఇక ఎంత మాత్రం ఈ యుద్ధాలు చేసే ఓపిక తనకు లేదని కనుక జయం రవికి బ్రేకప్ చెప్పి మీకే అప్పగించేసి చెన్నై విడిచి వెళ్ళిపోతున్నానన్నారు.

చెన్నైని, దాంతో పాటే నాకెంతో ఇష్టమైన సంగీతాన్ని, సోషల్ మీడియాని, జయం రవిని, అన్ని బాధ్యతలని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాని డిలీట్ చేస్తున్నట్లు సింగర్ కెనిషా ప్రకటించారు. 



Related Post

సినిమా స‌మీక్ష