బండి భగీరథ్‌ అరెస్ట్.. రిమాండ్ మీద చర్లపల్లి జైలుకి!

May 17, 2026
img



దాదాపు పది రోజులుగా సాగుతున్న హైడ్రామా శనివారం సాయంత్రం బండి భగీరథ్‌ని పోలీసులు అరెస్ట్ చేయడంతో ముగిసింది. అతని కోసం గాలిస్తున్న పోలీసులు నార్సంగి పోలీస్ అకాడమీ సమీపంలో కనుగొని అరెస్ట్ చేశారని సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి తెలిపారు. 

మేడ్చల్ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత పోలీసులు అతనిని మేడ్చల్ కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించింది. పోలీసులు అతనిని చర్లపల్లి జైలుకి తరలించారు. కోర్టులో హాజరు పరిచే ముందు పోలీసులు రెండు గంటల సేపు ప్రశ్నించి అతను చెప్పిన వివరాలన్నీ రికార్డ్ చేశారు.  

అతని తండ్రి బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ, “చట్టం మీద గౌరవంతో మేమే అతనిని పోలీసులకు అప్పగించాము,” అని చెప్పారు.

బండి భగీరథ్‌ అరెస్ట్ అయినందున ఇప్పుడీ వ్యవహరం పోలీసులు-కోర్టుకి మారింది. ఇప్పుడు అతను బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు కానీ ఇది పోక్సో కేసు కనుక న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేస్తుందో లేదో? 

Related Post