రామ్ చరణ్-బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో జూన్ 4న పెద్ది విడుదల కాబోతోంది. రేపు (సోమవారం) ముంబాయిలో పెద్ది ట్రైలర్ విడుదల కాబోతోంది. ఈ సినిమా రంగస్థలంకి మించి ఉండబోతోందని టాక్ వినిపిస్తుండటంతో మెగాస్టార్ చిరంజీవి ఉత్సాహం ఆపుకోలేక పెద్ది ట్రైలర్ చూశారు. చూసిన తర్వాత ఉత్సాహం ఇంకా పెరిగిపోయింది. ఆ ఉత్సాహంతో ట్రైలర్‌లో “మీరందరూ నేను ఆడనని అనుకుంటున్నారు... నేను పోరాడాను సారూ...” అంటూ పెద్ది చెప్పే చిన్న డైలాగ్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. “సారీ బుచ్చిబాబు... ట్రైలర్ చూశాక కంట్రోల్ తప్పా...” అని సరదాగా సంజాయిషీ కూడా ఇచ్చుకున్నారు.
ట్రైలర్ నిడివి మూడు నిమిషాలని చిరంజీవి చెప్పేశారు. ట్రైలర్ గురించి చిరంజీవి ఇంకా ఏమన్నారంటే, ఫైర్ పవర్ ప్యాక్డ్ ట్రైలర్. చరణ్, బుచ్చి, రెహమాన్... ముగ్గురూ తమ బెస్ట్ ఇచ్చారు. ముగ్గురూ కలిసి రఫ్ఫాడించేశారు,” అంటూ ప్రశంశల వర్షం కురిపించారు.
పెద్ది గురించి చిరంజీవి చెప్పిన ఈ మాటలు, పోస్ట్ చేసిన ఈ ఒక్క మెసేజ్ ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తుందని చెప్పక తప్పదు. పెద్దిలో రామ్ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్ నటించగా, కన్నడ నటుడు శివకుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు, జగపతిబాబు తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.
వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించిన పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
#PeddiTrailer చూసాను!! 🔥
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 16, 2026
Just… WOW 🤗🤗🤗
3 నిమిషాలు…
PURE FIREPOWER PACKED TRAILER!! ✨
చరణ్… బుచ్చి… రెహమాన్…
ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు… కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు! 🫡
ఎంత ఊహించుకున్నా… దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్.
Emotion… Elevation… Madness… అన్నీ next…