ప్రధాని మోడీ మాట తప్పారని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచబోమని పదేపదే చెప్పారు. కానీ ఎన్నికలు కాగానే ధరలు పెంచేశారు. అంతేకాదు.. పశ్చిమాసియా యుద్ధం పేరుతో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం ప్రజలను మోసగించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయం సరికాదు. దీని వలన దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులపై మరింత భారం పడుతుంది,” అంటూ ఓ పెద్ద లేఖని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రధాని మోడీ పాలన, నిర్ణయాల గురించి తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఏమన్నారో ఆయన మాటల్లోనే...
నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయం ఏ మాత్రం సమర్థనీయం కాదు. ఈ నిర్ణయం అనేక రంగాల పై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల పాలిట పిడుగుపాటు అవుతుంది.
— Revanth Reddy (@revanth_anumula) May 16, 2026
మోదీ ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల…