కొరియన్ కనకరాజు నుంచి తొలి పాట కంసహమిడ!

April 09, 2026


img

మేర్లపాక గాంధీ-వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో సిద్దమవుతున్న ‘కొరియన్ కనకరాజు’ నుంచి కంసహమిడ అంటూ సాగే తొలి పాట ఈ నెల 11న విడుదల కాబోతోంది. ఈవిషయం తెలియజేస్తూ వరుణ్ తేజ్-సంగీత దర్శకుడు తమన్ ఓ కామెడీ స్కిట్ చేసి ఆ వీడియో యూట్యూబ్‌లో విడుదల చేశారు.  

హర్రర్-కామెడీ జోనర్‌లో రూపొందిస్తున్న ఈ  సినిమాలో వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ ఉగాది పండుగ సందర్భంగా విడుదల చేశారు. 

ఈ సినిమాలో వరుణ్ తేజ్‌కి జంటగా రితికా నాయక్ నటిస్తుండగా సత్య ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా కథ దక్షిణ కొరియాలో జరిగినట్లు చూపుతున్నారు. కనుక ఎక్కువ సన్నివేశాలు అక్కడే షూటింగ్‌ చేశారు. ఇటీవలే   అక్కడ ఆఖరి షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. 

యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ బ్యానర్లపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి కలిసి నిర్మిస్తున్నారు.         


Related Post

సినిమా స‌మీక్ష