అల్లు అర్జున్‌-అట్లీ సినిమా టైటిల్‌ ఇదే!

April 08, 2026


img

ఈరోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ పుట్టిన రోజు సందర్భంగా అట్లీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా టైటిల్‌ పోస్టర్ కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. ఈ సినిమా టైటిల్‌ ‘రాకా’ అని ప్రకటించారు. టైటిల్‌ పోస్టర్లో ఎలుగుబంటిలా పెద్ద పెద్ద గోళ్ళున్న చేతితో అల్లు అర్జున్‌ని చూపారు. ఇలాంటి పోస్టర్, ఇలాంటి పాత్ర ఎవరూ ఊహించి ఉండరు కనుక టైటిల్‌ పోస్టర్ చూసి అందరూ షాక్ అయ్యే ఉంటారు. అల్లు అర్జున్‌ ఇలాంటి పాత్ర చేస్తున్నందుకు అభిమానులు సంతోషంతో ఉప్పొంగిపోయే ఉంటారు.   

ఇదొక పునర్జన్మల సైన్స్ ఫిక్షన్ మూవీ అని ముందే చెప్పారు. ఇప్పుడీ టైటిల్‌ పోస్టర్‌తోనే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి జోడీగా దీపికా పడుకొణే నటిస్తున్నారు.  

ఈ సినిమాని చాలా భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ 9 భారతీయ భాషల్లో నిర్మిస్తున్నారు. ఆ తర్వాత వివిధ విదేశీ భాషలలో కూడా డబ్ చేసి విడుదల చేసే అవకాశం ఉంది. 2027 వేసవిలో రాకా విడుదలయ్యే అవకాశం ఉంది.  

అల్లు అర్జున్‌ లోకేష్ కనగారాజ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్దా కపూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు  బన్నీవాస్, నట్టి, శాండీ, స్వాతి సహా నిర్మాతలు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు.



Related Post

సినిమా స‌మీక్ష