రాకాలో రమ్యకృష్ణ

April 09, 2026


img

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌- కోలీవుడ్‌ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘రాకా’పై ఒకే ఒక్క టైటిల్‌ పోస్టర్‌తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతాయి.

ఈ పునర్జన్మల సైన్స్ ఫిక్షన్ మూవీలో అల్లు అర్జున్‌కి జోడీగా దీపికా పడుకొణే నటిస్తున్నారు. తాజాగా సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా కీలకపాత్ర చేయబోతున్నట్లు సంకేతం ఇచ్చారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాకా టైటిల్‌ పోస్టర్ పెట్టి “పరిధులకు అతీతమైన ఒక దృశ్యం కోసం సిద్ధంకండి,” అంటూ మెసేజ్ పెట్టారు. 

సాధారణంగా సినిమాలో నటించబోతున్నవారు లేదా సినిమా కోసం పనిచేయబోతున్న సాంకేతిక నిపుణులు మాత్రమే ఇలా సందేశాలు పెట్టి తాము కూడా భాగాస్వాములమని తెలియజేస్తుంటారు. కనుక రాకాలో రమ్యకృష్ణ పాత్ర ఏమిటనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.   

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ సుమారు రూ.1,000 కోట్ల భారీ బడ్జెట్‌తో 9 భారతీయ భాషల్లో రాకా నిర్మిస్తున్నారు. 2027 వేసవిలో రాకా విడుదలయ్యే అవకాశం ఉంది. 



Related Post

సినిమా స‌మీక్ష