నేడే అస్సాం, కేరళ, పుదుచ్చేరి ఎన్నికలు

April 09, 2026


img

నేడు అస్సాం, కేరళ, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. అస్సాంలో 126 స్థానాలకు మొత్తం 189 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. 

ఇక్కడ ప్రధానం కాంగ్రెస్‌, బిజేపిల మద్యనే పోటీ సాగుతుంది. ఎన్నికల సంఘం మొత్తం 31,490 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మరికొద్ది సేపటిలో పోలింగ్ ప్రారంభమవుతుంది.    

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 30 స్థానాలకు నేడు ఎన్నికలు జరుగబోతున్నాయి.    

కేరళలో మొత్తం 140 నియోజకవర్గాలకు నేడు ఎన్నికలు జరుగబోతున్నాయి. మొత్తం 2.71 కోట్లు మంది ఓటర్లున్నారు. వారి కోసం ఎన్నికల సంఘం 30,495 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. 

కేరళలో దశాబ్దాలుగా ఎల్డీఎఫ్ (వామపక్షాలు), యూడీఎఫ్ (కాంగ్రెస్‌ కూటమి) మధ్యే అధికార మార్పిడి జరుగుతోంది. కేరళ ప్రజలు ఈ ఆనవాయితీకే కట్టుబడితే ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్‌ని గద్దె దించి మళ్ళీ యూడీఎఫ్‌కి అధికారం కట్టబెట్టే అవకాశం ఉంది. 

కేరళలో హిందూ, ముస్లిం, క్రీస్టియన్ జనాభా ఇంచు మించు సరిసమానంగా ఉంది. కనుక మతం ప్రాతిపదికన రాజకీయాలు చేసే బిజేపి కేరళలోని హిందూ ఓటర్లను ఆకట్టుకొని అధికారం చేజిక్కించుకోవాలని ఆరాటపడుతోంది. కనుక ఈసారి మరింత గట్టిగా ప్రయత్నిస్తోంది. కనుక ఈసారి బిజేపి నుంచి కూడా ఆ రెండు కూటములకు గట్టి పోటీ ఉంది.


Related Post