తెలంగాణలో మూడు రోజులు వర్షాలు

April 03, 2026
img

తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే వేసవి ఎండలు, ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ ఓ చల్లటి కబురు చెప్పింది. రేపు (శనివారం) నుంచి రాష్ట్రంలో హైదరాబాద్‌తో పలు జిల్లాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే నేడు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్‌, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో కొన్ని ప్రాంతాలలో చిరుజల్లులు కురుస్తుండటంతో వాతావరణం చల్లబడింది.

శనివారం నుంచి ఈ మూడు ఉమ్మడి జిల్లాలతో పాటు జనగామ, రాజన్న సిరిసిల్లా, జగిత్యాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది.

అదివారం ఈ జిల్లాలతో పాటు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. వర్షంతో పాటు గంటకు 40కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలియజేసింది. తీవ్రమైన ఎండ, వేడితో అవస్థలు పడుతున్న ప్రజలకు వరుణదేవుడు మూడు రోజుల పాటు ఉపశమనం కలిగించబోతున్నాడన్న మాట!  

Related Post