అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనాలోచితంగా ఏకపక్షంగా ఇరాన్‌తో యుద్ధం మొదలుపెట్టి ఊబిలో కూరుకుపోయారు. అనేక మిలియన్ డాలర్లు, అత్యంత శక్తివంతమైన క్షిపణులు ఖర్చయిపోయాయి కానీ యుద్ధం ముగియలేదు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న ట్రంప్, అమెరికా మిలట్రీ జనరల్ రాండీ జార్జ్ పై వేటు వేశారు.
అమెరికా రక్షణ కార్యదర్శి ఆదేశం మేరకు అయన తక్షణం రాజీనామా చేసి పదవీ విరమణ చేసినట్లు ప్రకటించారు. నెలరోజులుగా ఇరాన్ మీద బాంబుల వర్షం కురిపిస్తున్నా, ఇరాన్‌ని నేలమట్టం చేసేస్తామని బెదిరిస్తున్నా ఇరాన్‌ని లొంగదీయలేకపోతున్నారు ట్రంప్. కనుక తన వైఫల్యానికి జనరల్ రాండీ జార్జ్ ని బలిపశువుగా చేశారు.
ఇరాన్‌తో భీకర యుద్ధం సాగుతున్న సమయంలో అమెరికా సైన్యాధ్యక్షుడుని తప్పించడం అంటే వైఫల్యాన్ని అంగీకరించడమే అవుతుంది.
అంతేకాదు... నాలుగున్నర దశాబ్దాలుగా అమెరికాకు సేవ చేసినందుకుగాను అత్యంత గౌరవప్రదంగా పదవీ విరమణ చేయాల్సిన సైన్యాధ్యక్షుడిని ట్రంప్ అవమానకరంగా బయటకు సాగనంపడం అమెరికా సైనికులు, ప్రజలు కూడా జీర్ణించుకోగలరా?
జనరల్ రాండీ జార్జ్ స్థానంలో జనరల్ క్రిస్టోఫర్ లా నీవీని యాక్టింగ్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమితులయ్యారు.