ఏడు మండలాల గురించి కిషన్ రెడ్డి పచ్చి అబద్దాలు: హరీష్‌

April 03, 2026


img

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురువారం రాజ్యసభలో మాట్లాడుతూ, “కేసీఆర్‌ అంగీకారంతోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చెందిన ఏడు మండలాలలను ఏపీలో విలీనం చేసింది,” అని అన్నారు. హరీష్‌ రావు స్పందిస్తూ రాజ్యసభలో కిషన్ రెడ్డి ఘోరమైన అబద్దాలు చెప్పారు. విభజన చట్టంలో ఏడు మండలాలు ఏపీలో విలీనం చేయబోతున్నట్లు పేర్కొనలేదు.

కానీ తర్వాత చంద్రబాబు నాయుడు ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసి ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసింది. దీనిలో కిషన్ రెడ్డి పాత్ర కూడా ఉంది. తెలంగాణ మండలాలను ఏపీలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ అప్పుడే కేసీఆర్‌ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు కూడా.

కానీ ఈ కిషన్ రెడ్డి వాస్తవాలను వక్రీకరించి విభజన చట్టంలోనే ఏడు మండలాలు ఏపీలో విలీనం చేయాలని ఉందంటూ రాజ్యసభలో అబద్దాలు చెప్పారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారు.       

కాళేశ్వరం గురించి సిఎం రేవంత్ రెడ్డి వాదనలనే కిషన్ రెడ్డి కూడా నిన్న రాజ్యసభలో వినిపించారు. దీనిని బట్టి కాంగ్రెస్‌, బిజేపిల మద్య రహస్య అవగాహన ఉందని మరోసారి రుజువైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి కిషన్ రెడ్డి రాజ్యసభలో నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఒకసారి నాతో వస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో ఎన్ని ప్రాంతాలలో నీరు పారుతోందో చూపిస్తాను,” అని హరీష్‌ రావు అన్నారు.


Related Post