తిమ్మరాజుపల్లి టీవీలో నిజమేనా నిజమేనా సాంగ్‌ ప్రమో

April 03, 2026


img

నూతన దర్శకుడు వి. మునిరాజు దర్శకత్వంలో తీసిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ ఏప్రిల్‌ 17న విడుదల కాబోతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మూడు పాటలు చాలా అలరిస్తున్నాయి. తాజాగా ‘నిజమేనా నిజమేనా...’ అంటూ సాగే పాట ప్రమో విడుదలైంది. సనారే వ్రాసిన ఈ పాటని వంశీకాంత్ రేఖన స్వరపరిచి సంగీతం అందించగా జయశ్రీ పళ్ళెం అద్భుతంగా ఆలపించారు. 

ఈ సినిమాతో కెమెరా మ్యాన్ సాయి తేజ హీరోగా పరిచయం అవుతున్నాడు. అతనికి జోడీగా వేద జలందర్ (వేదశ్రీ) నటించింది. మరో విశేషమేమిటంటే కిరణ్ అబ్బవరం ఈ సినిమా నిర్మాతలలో ఒకరు. 

చాలా తక్కువ బడ్జెట్‌లో తెలంగాణ నేపధ్యంతో తీసిన ఈ ప్రేమకథా చిత్రంలో ప్రదీప్ కొట్టే, స్వాతి కరీంరెడ్డి, అమ్మ రమేష్, వడ్డాది సత్యనారాయణ, తేజ విహాన్, టీవీ రామన్, మాధవి ప్రసాద్, చిట్టిబాబు, అన్షుమన్, లతీష్ కీలపట్టు ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు దర్శకత్వం: వి.మునిరాజు, సంగీతం: వంశీకాంత్ రేఖన, కెమెరా: అక్షయ రామ్‌ పోడిశెట్టి, ఆర్ట్: సుదీర్ మాచెర్ల చేశారు. 

కేఎ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిరణ్ అబ్బవరం, తేజేశ్వర్ కలిసి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 17న విడుదల కాబోతోంది. 

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/tWMp-MY361s?si=6tncqJJUO33k4Pi2" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>


Related Post

సినిమా స‌మీక్ష