పెద్ది ఆలస్యం లేదు: రామ్‌ చరణ్‌

April 03, 2026


img

ఈ నెల 30న ‘పెద్ది’ విడుదల కాబోతోంది. కానీ ఇటీవల నిర్మాత ఎస్‌కెఎన్ పెద్ది జూన్ 25కి వాయిదా పడిందనన్నారు. కానీ తర్వాత పొరపాటున అలా చెప్పానంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. అప్పటి నుంచి పెద్ది వాయిదా పడిందని ఊహాగానాలు జోరుగా సాగుతూనే ఉన్నాయి.

వాటిని పెద్ది టీమ్‌ ఖండించకపోవడంతో సినిమా వాయిదా పడిందనే అందరూ భావిస్తున్నారు. ఇటీవల రాకాసా టీమ్‌ రామ్‌ చరణ్‌తో భేటీ అయినప్పుడు ఇదే ప్రశ్న అడగగా, “షూటింగ్‌ పూర్తయిపోయింది. సినిమా ఆలస్యం అవడం లేదని మీరే అందరికీ చెప్పండి,” అని అన్నారు.

అంతే తప్ప పెద్ది ఏప్రిల్‌ 30నే విడుదలవుతుంది అని ఖచ్చితంగా చెప్పలేదు. కనుక పెద్ది వాయిదా పడినట్లే అనుకోవచ్చు. త్వరలోనే పెద్ది టీమ్‌ సినిమా విడుదల గురించి స్పష్టత ఇస్తే తప్ప అసలు విషయం తెలియదు.

ఇంతవరకు ‘పెద్ది’ గ్రామీణ క్రికెట్ నేపధ్యంలో సాగిన కథ అని అందరూ అనుకుంటే, హటాత్తుగా రామ్‌ చరణ్‌ని కుస్తీ చాంపియన్‌గా చూపడంతో అభిమానులు సంతోషంతో పొంగిపోతున్నారు. చేతిలో గద పట్టుకొని కండలు తిరిగిన శరీరంతో రామ్‌ చరణ్‌ పోస్టర్ చూసి కొందరు ఇక హనుమంతుడి పాత్రకు ఎవరినీ వెతుక్కోవాల్సిన అవసరం లేదంటూ ట్వీట్స్ చేశారు. 

ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్‌, కోచ్‌ గౌరు నాయుడుగా శివరాజ్ కుమార్‌ నటిస్తున్నారు. జగపతి బాబు, శివ రాజ్ కుమార్‌, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి అందిస్తున్నారు. 

వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు దీనిని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 30న పెద్ది ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష