ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సిద్దమవుతున్న ‘డ్రాగన్’లో మలయాళ నటుడు టొవినో థామస్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. వాటిపై అయన స్పందిస్తూ, “చాలా కాలంగా నేను తెలుగు సినిమాలలో నటించాలనుకుంటున్నాను. నేను ఒకేసారి రెండు మూడు సినిమాలు ఎప్పుడు చేయను. అలా చేస్తే ఒక సినిమా ప్రభావం మరో సినిమాపై పడే ప్రమాదం ఉంటుంది. కనుక ఒక సినిమా పూర్తిచేసిన తర్వాత మరొకటి చేస్తుంటాను. ప్రస్తుతం నా చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. కనుక సమయం కేటాయించలేక డ్రాగన్ మిస్ అయ్యాను. ఇక్కడ ఇండస్ట్రీలో సినిమాలు చాలా వేగంగా షూటింగ్ పూర్తిచేస్తారు. కానీ టాలీవుడ్‌లో చాలా టైమ్ తీసుకుంటారు. చాలా షెడ్యూల్స్ చేయాల్సి ఉంటుంది. కనుక తెలుగులో నటించాలనే నా కోరిక ఇప్పట్లో తీరేలా లేదు,” అని అన్నారు.
టొవినో థామస్ గత 15 ఏళ్ళుగా మలయాళ సినిమాలలో నటిస్తున్నారు. ఇప్పటి వరకు 55కి పైగా చేశారు. వాటిలో హీరో పాత్రతో పాటు విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వంటి అన్ని రకాల పాత్రలు ఒప్పుకొని చేస్తుంటారు. అందువల్లే తాను మలయాళ సినీ పరిశ్రమలో ఎల్లప్పుడూ బిజీగా ఉంటానని టొవినో థామస్ చెప్పారు.