శర్వా బైకర్ ప్రమోషన్స్‌ కోసం ప్రభాస్‌!

April 01, 2026


img

అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం శర్వానంద్ హీరోగా ‘బైకర్’ ఈ నెల 3న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రభాస్‌ కూడా బైక్ రైడ్ చేశారు. పాన్ ఇండియా స్టార్‌ స్థాయికి ఎదిగిన ప్రభాస్‌ తన స్నేహితుడు, సాటి నటుడు శర్వా కోసం బైకర్ ప్రమోషన్స్‌లో పాల్గొనడం చాలా అభినందనీయమే. 28 సెకన్ల నిడివి గల ఆ వీడియో క్లిప్‌లో “ట్రైలర్‌ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్‌... లెట్స్ రోల్ అంటూ బైక్ తీస్తారు. 

శర్వానంద్ ఆ వీడియోని షేర్ చేస్తూ ప్రభాస్‌ అన్న థాంక్ యు. ఐ లవ్ యూ. నాకోసం నువ్వెప్పుడూ ఉన్నావు. మన బంధం ఎప్పటికీ ఇలా పరిమళిస్తూనే ఉంటుంది. యస్.. ట్రైలర్‌ చూసి కొన్ని నమ్మేయాలి,” అని ట్వీట్‌ చేశారు.      

ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌లో డా.రాజశేఖర్‌ శర్వా తండ్రి, కోచ్‌ అనే కొత్త విషయం బయటపెట్టారు.    

బైక్ రేసింగ్ కాన్సెప్ట్ తో ఇంతవరకు సినిమాలు రాలేదు. కనుక ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ట్రై ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచింది.. ఇప్పుడు ప్రభాస్‌ కూడా ఓ చెయ్యేశారు. ఇక రయ్యి మంటూ దూసుకుపోవడమే!        

యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ కృష్ణ రెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: గిబ్రన్; కెమెరా: జె యువరాజ్; ఎడిటింగ్: అనిల్ పాశాల; స్టంట్స్: దిలీప్ సుబ్రమణియన్; ఆర్ట్: ఏ పన్నీర్ సెల్వం చేస్తున్నారు. ఏప్రిల్‌ 3న బైకర్ విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష