పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీస్ జారీ

March 31, 2026


img

బీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ పోలీసులు నోటీస్ జారీ చేశారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్య అనుచరులకు కూడా నోటీసులు జారీ చేశారు. 

మేడారం హరీష్ రావు జాతర సమయంలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి వనదేవతల గద్దెల వద్ద పోలీసులతో ఘర్షణ పడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఏప్రిల్‌ 4న ఉదయం 11:30 గంటలకు తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. 

తనతో పాటు తన కుటుంబ సభ్యులకు కూడా సీఐడీ నోటీసులు ఇవ్వడాన్ని  పాడి కౌశిక్ రెడ్డి తప్పు పట్టారు. “నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే మేము ఏ తప్పు చేయనప్పటికీ ఈ అక్రమ కేసు నమోదు చేసి అందరికీ నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వానికి దమ్ముంటే నన్ను రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఇలా తప్పుడు కేసులో నా కుటుంబ సభ్యులను ఇరికించి, వేధించాలనుకోవడం సరికాదు. మేము ఎ తప్పు చేయలేదు. కనుక ఇలాంటి తప్పుడు కేసులకు భయపడి వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాను,” అని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా ఓ పోస్ట్ పెట్టారు. 



Related Post