తమిళనాడు శాసనసభ ఎన్నికలు ఏప్రిల్ 23న జరుగబోతున్నాయి. కనుక అప్పుడే పార్టీలు, టికెట్లు హడావుడి మొదలైపోయింది. కోలీవుడ్ హీరో విజయ్ దళపతి టివీకే పార్టీతో ఎన్నికల బరిలో దిగుతుంటే, ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు సి. సుందర్ అన్నాడీఎంకే కూటమిలోని పిఎన్‌కే పార్టీ అభ్యర్ధిగా మదురై సెంట్రల్ నుంచి పోటీ చేయబోతున్నారు.
ఈ విషయం ఆ పార్టీ అధ్యక్షుడు ఏసీ షణ్ముగం చెప్పారు. అయితే సుందర్ అన్నాడీఎంకే ఎన్నికల గుర్తు (రెండు ఆకులు)తోనే పోటీ చేస్తారని చెప్పారు.
ప్రముఖ నటి, బిజేపి సీనియర్ నేత ఖుష్బూ భర్తే సుందర్. తమిళనాడు ప్రజలు ఇంతకాలం తన భర్తని ఎంతగానో ఆదరించారని, కనుక ఇప్పుడు వారికి సేవ చేసేందుకే తన భర్త ఎన్నికలలో పోటీ చేస్తున్నారని ఖుష్బూ అన్నారు.
తమిళనాడు అన్నాడీఎంకే-బిజేపి- పిఎన్‌కే పార్టీలు కూటమిగా ఉండగా, అధికార డీఎంకే-కాంగ్రెస్ మరికొన్ని పార్టీలు మరో కూటమిగా ఉన్నాయి. వీటి మద్య విజయ్ దళపతి ఒంటరిగా అన్ని స్థానాలకు పోటీ చేస్తున్నారు.