రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల వద్ద రూ.700కోట్లు వ్యయంతో 8 ఎకరాలలో తెలంగాణ ప్రభుత్వం ఓంకారేశ్వర్ ఆలయం నిర్మించబోతోంది. దీనికి సిఎం రేవంత్ రెడ్డి శనివారం ఉదయం శంకుస్థాపన చేశారు.
చారిత్రిక వీరభద్రస్వామి ఆలయ సమీపంలో నిర్మిస్తున్న ఈ ఓంకారేశ్వర్ ఆలయం గాలిగిపురం వంద అడుగులు ఎత్తుతో నిర్మిస్తారు.
మూసీ రివర్ ఫ్రంట్ కార్పోరేషన్ అధ్వర్యంలో నిర్మితమవుతున్న మూసీ ప్రాజెక్టులో భాగంగా మూసీ నది మద్య దీవిపై వంద అడుగుల శివుడి విగ్రహం ఏర్పాటు చేస్తారు.
ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు.
మూసీ ప్రాజెక్టు ప్లానింగ్, వివిధ శాఖల మద్య సమన్వయం, నిర్మాణ పనుల పర్యవేక్షణ కొరకు రాష్ట్ర ప్రభుత్వం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఓ మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది.
దీనిలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉంటారు. మూసీ ప్రాజెక్ట్ ఎండీ దీనిలో కన్వీనర్‌గా ఉంటారు. ఈ కమిటీ సమావేశాలు ఆయా జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరవుతారు.