తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు శుభవార్త

March 28, 2026
img

తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు ఓ గొప్ప శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు విద్యుత్ వాహనాలు 20 శాతం రాయితీపైలభిస్తాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సదరు కంపెనీలతో మాట్లాడి ఒప్పించింది. ఈ లెక్కన ద్విచక్రవాహనాలపై సుమారు రూ..25,000 వరకు, కార్లపై సుమారు రూ.4 లక్షల వరకు ఉద్యోగులకు ఆదా అవుతుంది. అంతేకాదు... 2026 డిసెంబర్‌లోగా కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకునే వాహనాలకు రోడ్ టాక్స్ ఉండదు. రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది ప్రభుత్వోద్యోగులున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తరచు పెరుగుతుండటం,కొరత ఏర్పడుతుండటం పరిపాటిగా మారిందిప్పుడు. కనుక వారికిది గొప్ప అవకాశమే అని చెప్పొచ్చు. 


Related Post