జూ.ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ టైటిల్‌ పోస్టర్ రెడీ

May 24, 2026


img

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్‌ ఓ పౌరాణిక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దీనికి మురుగన్,  ది గాడ్ ఆఫ్ వార్' అనే పేరు వినిపిస్తోంది. కానీ తెలుగు భాషని ప్రేమించే వారిద్దరూ తమ సినిమాకి తమిళ పేరు పెట్టకపోవచ్చు. వారి సినిమా టైటిల్‌ మోషన్ పోస్టర్ రెడీ అయినట్లు తెలుస్తోంది. అది విడుదలైతే సినిమా పేరు, పూర్తిగా పౌరాణికమా లేక సోషియో ఫ్యాంటసీ సినిమానా అనే విషయం తెలుస్తుంది. 

ప్రస్తుతం జూ.ఎన్టీఆర్‌ ప్రశాంత్ నీల్‌ డ్రాగన్‌తో  బిజీగా ఉన్నారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విక్టరీ వెంకటేష్‌తో ఆదర్శ కుటుంబంతో బిజీగా ఉన్నారు. కనుక ఇద్దరూ ఆ సినిమాలు పూర్తి చేసిన తర్వాత ఈ కొత్త సినిమా మొదలుపెడతారు. కానీ కలిసి సినిమా చేయాలనుకున్నారు కనుక త్రివిక్రమ్ సూచనల ప్రకారం ఆలోగా ప్రీ-ప్రొడక్షన్ పనులు చేసుకోవచ్చు.

డ్రాగన్ వచ్చే ఏడాది జూన్‌ 11న విడుదల కాబోతోంది. ఆదర్శ కుటుంబం రిలీజ్‌ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. 


Related Post

సినిమా స‌మీక్ష