పోలీస్ స్టేషన్లలో ఏఐ కాప్ రైటర్ యాప్

May 23, 2026


img

హైదరాబాద్‌ సిపీ విసి సజ్జనార్‌ శనివారం బంజారా హిల్స్‌, టీజీఐసీసీసీ కార్యాలయంలో ఏఐ ఆధారంగా పనిచేసే ‘ఏఐ కాప్ రైటర్ యాప్’ మొబైల్ యాప్‌ని ఆవిష్కరించారు. 

వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి నగరంలో పని చేస్తున్నవారు.. వివిధ దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు ఏదైనా సమస్య ఎదురైతే పోలీస్ స్టేషన్‌కు వచ్చి పిర్యాదు చేయాలనుకుంటే భాష పెద్ద సమస్యగా మారుతుంది. వారు చెప్పేది పోలీసులకు అర్థం కాక, పోలీసులు అడిగే వివరాలు వారికి అర్థం కాక పిర్యాదు నమోదు చేయడమే చాలా కష్టంగా మారుతుంది. 

బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌క్‌ సొల్యూషన్స్ సంస్థలో ఇంటర్న్ పాగ్రో చందూ ఈ సమస్యకు పరిష్కారంగా ‘ఏఐ కాప్ రైటర్ యాప్’ మొబైల్ యాప్‌ని తయారుచేసి విసి సజ్జనార్‌కి అందించారు. దానిని ప్రయోగాత్మకంగా పలుమార్లు పరీక్షించి ఆవిష్కరించారు. 

ఇది ప్రధానంగా పది భారతీయ భాషలలోనూ పనిచేస్తుంది. ఎవరు ఏ భాషలో మాట్లాడినా వెంటనే తెలుగు, హిందీ లేదా  ఉర్దూ భాషల్లోకి తర్జుమా చేసి ఇస్తుంది. 

అదేవిధంగా పోలీసులు తెలుగు లేదా ఉర్దూలో అడిగే వివరాలను పిర్యాదిదారుడి భాషలోకి అనువదించి ఇస్తుంది. ఒకరి కంటే ఎక్కువ మంది పిర్యాదీదారులు ఉన్నట్లయితే వారి గొంతుని గుర్తించి వేర్వేరుగా వారు చెప్పే వివరాలు నమోదు చేసి వ్రాత పూర్వకంగా ఇస్తుంది. 

ఈ ప్రయోగం విజయవంతం అవడంతో హైదరాబాద్‌ నగర పరిధిలోని 80కి పైగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో ‘ఏఐ కాప్ రైటర్ యాప్’ మొబైల్ యాప్‌ని అమలులోకి తెస్తున్నామని విసి సజ్జనార్‌ చెప్పారు. 


Related Post