మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా చేస్తున్న ‘లెనిన్’ టీజర్ నేడు విడుదలైంది. ఇది గ్రామీణ నేపధ్యంలో సాగే ఈ రొమాంటిక్ కమర్షియల్ సినిమా అని టీజర్‌తో స్పష్టం చేశారు. టీజర్ బాగుంది కనుక ఇదే లెక్కన సినిమా కూడా ఉంటే ఈసారి అఖిల్ ఖాతాలో హిట్ పడటం ఖాయం.
ఈ సినిమాకి సంగీతం: తమన్, కెమెరా: ఐ నవీన్ కుమార్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
ఈ సినిమాని అన్నపూర్ణా స్టూడియోస్, సీతారా ఎంటర్‌టైన్‌మెంట్స్, మనం ఎంటర్‌ప్రైజస్ ఎల్ఎల్‌పీ బ్యానర్లపై అక్కినేని కుటుంబం, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మిస్తున్నారు. జూన్ 26న విడుదల కాబోతోంది.