మెగాస్టార్ చిరంజీవి 158వ సినిమా పూజా కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. అన్న చిరంజీవి సినిమాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టారు.
చిరంజీవి స్పందిస్తూ ‘సుమారు 30 సంవత్సరాల క్రితం తమ్ముడు పవన్ హీరోగా నటించిన ‘అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి’ సినిమాకి నేను క్లాప్ కొట్టాను. ఇప్పుడు నా సినిమాకి తమ్ముడు క్లాప్ కొట్టి ప్రారంభించాడు,” అని అన్నారు.
ఇదే విషయం అభిమానులకు కూడా తెలియజేస్తూ “ఈ రోజు కళ్యాణ్ బాబుకి, నాకు మధ్యలో క్లాప్ కనిపిస్తుంటే… 30 సంవత్సరాల క్రితం ఇదే సీన్ రివర్స్‌లో జరిగిన సందర్భం గుర్తుకు వస్తోంది- “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి“ ఈ రోజు డిప్యూటీ సీఎం హోదాలో టైమ్ తీసుకుని వచ్చి, నా 158వ సినిమా ముహూర్తంలో పాల్గొని, క్లాప్ ఇచ్చి యూనిట్ సభ్యులందరినీ ఆనందపరిచినందుకు థాంక్యూ లవ్ యూ కళ్యాణ్,” అని సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టారు.
ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్‌తో పాటు సోదరుడు నాగబాబు, మెగా ఫ్యామిలీ, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
చిరంజీవికి వాల్తేర్ వీరయ్య వంటి సూపర్ హిట్ అందించిన మాస్ డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి కూతురుగా అనశ్వర రాజన్ నటిస్తోంది. ఆమె కూడా ఈ వేడుకలో పాల్గొంది.