పాపం ట్రంప్‌! కొడుకు పెళ్ళికి వెళ్ళాలన్నా భయమే!

May 22, 2026


img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ పెద్ద కొడుకు ట్రంప్‌ జూనియర్ రెండో పెళ్ళి ఈ వారంలో జరుగబోతోంది. అయితే ఇరాన్‌తో యుద్ధం కారణంగా అధ్యక్షుడు ట్రంప్‌ ఎప్పుడైనా తాను హత్యకు గురి కావచ్చునని భయపడుతున్నారు. కనుక బహామాస్‌లో జరుగబోయే కొడుకు పెళ్ళికి హాజరు కాలేకపోవచ్చునన్నారు. అక్కడకు వెళ్ళినా చంపేస్తారు వెళ్ళకపోతే మీడియా నన్ను చంపేస్తుందని ట్రంప్‌ జోక్ చేశారు. 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ భద్రత ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలుసు. అంత భద్రత కలిగిన ట్రంప్‌ కొడుకు పెళ్ళికి వెళితే ఎవరో తనని హత్య చేస్తారని భయపడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇరాన్‌పై దాడి చేసిన తొలిరోజే ఆ దేశపు సుప్రీం కమాండర్ ఖమేనీ నివాసంపై అమెరికా-ఇజ్రాయెల్‌ దళాలు బాంబుల వర్షం కురిపించి మట్టుబెట్టాయి. ఆ తర్వాత అయన వారసుడు మొతాబా ఖమేనీని కూడా మట్టుబెట్టాలని విశ్వప్రయత్నం చేశాయి కానీ నేటికీ సాధ్యం కాలేదు. 

కనుక ప్రతీకారేచ్చతో రగిలిపోతున్న ఇరాన్‌  ఏదోరోజున అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ని టార్గెట్ చేసే అవకాశం ఉందనే భావించవచ్చు. కనుక ట్రంప్‌ కొడుకు పెళ్ళికి వెళ్ళాలన్న భయపడే పరిస్థితి.. దయనీయమే కదా?


Related Post