సిద్ధిపేటలో గాజు వంతెన.. లవ్ సింబల్

May 22, 2026
img

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో గాజు వంతెన ఏర్పాటవుతోంది. స్థానిక ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులలో భాగంగా దీనిని నిర్మిస్తున్నారు. రూ. 4.22 కోట్లు వ్యయంతో చెరువు ఒడ్డున సుమారు ఒకట్టినర మీటర్ల వెడల్పు, 150 మీటర్ల పొడవుతో హృదయాకారంలో (లవ్ సింబల్) దీనిని నిర్మిస్తున్నారు. దీని కోసం చెరువులో పునాదులు వేసి నీళ్ళకు సుమారు రెండు మీటర్ల ఎత్తులో స్తంభాల మీద నిర్మిస్తున్నారు. గ్లాస్ బ్రిడ్జి నిర్మాణం దాదాపు పూర్తయింది. కానీ చెరువు సుందరీకరణ పనులు, గ్లాస్ వంతెనపై లైటింగ్ ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదు. ఒక నెల రోజులలో అన్ని పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకే తెస్తామని సంబందిత అధికారులు చెప్పారు.

ఆంధ్రాలో విశాఖపట్టణంలో బీచ్ ఒడ్డున గల కైలాసగిరి కొండపై గ్లాస్ వంతెన ఉంది. కొండ అంచున గాలిలో వ్రేలాడుతున్నట్లు ఉండే ఈ వంతెనపై నిలబడి చూస్తే ఎదురుగా సముద్రం, మరో పక్క అందమైన విశాఖ నగరం కనిపిస్తుంది.

Related Post