పెద్ది సెన్సార్ రిపోర్ట్ వచ్చేసిందోచ్

May 20, 2026


img

చాలా భారీ అంచనాలతో జూన్‌ 4న పెద్ది ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ట్రైలర్‌ కూడా బాగానే హైప్ సృష్టించింది. కనుక అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. వారికి మరో సంతోషకరమైన వార్త... సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.

తాజా సమాచారం ప్రకారం సెన్సార్ బోర్డు పెద్దికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. దాని ప్రకారం పెద్ది రన్ టైమ్‌ మూడు గంటల రెండు నిమిషాలు.

రామ్‌ చరణ్‌ సినిమా... అందునా పెద్ది క్రికెటర్... పెద్ది పహిల్వాన్ అంటూ ఒకేసారి రెండు ఆటలు ఆడేస్తున్నారు కనుక సినిమా కనీసం మూడు గంటలు లేకపోతే అభిమానులకు కూడా సంతృప్తి కలుగదు. మరో అర్ధగంట ఎక్కువైనా పర్వాలేదు కానీ మూడు గంటలకు తగ్గకూడదని కోరుకుంటారు. కనుక పెద్ది రన్ టైమ్‌తో వారు హ్యాపీయే అనుకోవచ్చు.

ఇక అందరూ ఈ నెల 23న భోపాల్‌లో విడుదల కాబోయే పెద్ది స్పెషల్ సాంగ్‌ కూడా చూసేస్తే ఆ తర్వాత థియేటర్లలో పెద్ది ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి సిద్ధమైపోవచ్చు.  

ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్‌, కోచ్‌ గౌరు నాయుడుగా శివరాజ్ కుమార్‌ నటిస్తున్నారు. జగపతి బాబు, శివ రాజ్ కుమార్‌, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.  

వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించిన పెద్ది జూన్ 4న విడుదల ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష