రేపు (గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉండగా అది 23కి వాయిదా పడింది. ఆరోజున సిఎం రేవంత్ రెడ్డి యాదగిరి గుట్టలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు.
కనుక ఆనవాయితీకి భిన్నంగా యాదగిరి గుట్టలోనే మంత్రివర్గ సమావేశం నిర్వహించబోతున్నట్లు సచివాలయ పరిపాలనా విభాగం ప్రకటించింది. కానీ సరస్వతీ నది అంత్యపుష్కరాలు ప్రారంభం కావడంతో ఈ నెల 23న సచివాలయంలోనే మంత్రివర్గ సమావేశం నిర్వహించబోతున్నట్లు మరో నోట్ ద్వారా మంత్రులకు తెలియజేసింది.
ఈ సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ళలు లబ్దిదారుల ఎంపికకు విధివిధానాలలో కొన్ని మార్పులు చేర్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగాల భర్తీ, పీఆర్‌సీ, పెన్షనర్లకు హెల్త్ కార్డులు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.