ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్ చాలా ఏళ్ళ విరామం తర్వాత మళ్ళీ సినీ పరిశ్రమలోకి వచ్చి రెండు వరుస హిట్స్ కొట్టి డేవిడ్ రెడ్డితో మూడో హిట్ కొట్టేందుకు సిద్ధం అవుతున్నారు.
మే 20న ఆయన భార్య మంచు మౌనిక పుట్టిన రోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో సామాజిక సేవా కార్యక్రమాలు చేసేందుకు ‘ఐఖ్య’ అనే సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిని పూర్తిగా సొంత నిధులతోనే నిర్వహిస్తామని చెప్పారు.
దీనికి రాజకీయాలతో ఎటువంటి సంబంధమూ లేదని చెపుతూనే ప్రజల గొంతుగా ఇది పని చేస్తుందని, వచ్చే ఎన్నికలలో తన భార్య మౌనిక పోటీ చేస్తుందని చెప్పడం విశేషం.
తండ్రి మంచు మోహన్ బాబు, అన్న మంచు విష్ణుతో గొడవలు పరిష్కరించుకున్నారా ఇంకా లేదా? అనే విలేఖరి ప్రశ్నకు ‘వెళ్ళి వారినే అడగండి,’ అని మంచు మనోజ్ సమాధానం చెప్పారు.