దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రత్యేకంగా తెలంగాణ రైతు విద్యుత్ సరఫరా కంపెనీ (టిజిఆర్‌పిడిసిఎల్) ఏర్పాటు చేస్తోంది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున నుంచి టిజిఆర్‌పిడిసిఎల్ పని చేసేందుకు సకల ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం ఈ ప్రతిపాదన చేసినప్పుడు విద్యుత్ అధికారులు, ఉద్యోగులు వ్యతిరేకించారు. కానీ సిఎం రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు సంబంధిత శాఖ ఉన్నతాధికారులు కేవలం 60 మంది ఉద్యోగులతో దీనిని ఏర్పాటుకి సన్నాహాలు మొదలుపెట్టారు. ముందుగా ఉత్తర, దక్షిణ డిస్కంల నుంచి అధికారులు, ఉద్యోగుల బదిలీలకు ఆప్షన్స్ ఇవ్వాలని కోరినప్పుడు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు.
కానీ తర్వాత ఈ కొత్త డిస్కంలో పదోన్నతులకు భారీగా అవకాశం ఉండటంతో రెండు డిస్కంల నుంచి భారీగా దరఖాస్తులు రావడంతో ఈ డిస్కంలో ఉద్యోగాల భర్తీ సమస్య పరిష్కారం అయ్యింది. వేమూరి రాధాకృష్ణ
టనే ఉత్తర, దక్షిణ డిస్కంల నుంచి వ్యవసాయ కనెక్షన్స్ గుర్తించి, స్థానికంగా వాటి విద్యుత్ సరఫరా సంస్థలు, కార్యాలయాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్లు, అకౌంటింగ్ సెక్షన్స్ వగైరా అన్నిటినీ ఒకటొకటిగా వేరు చేస్తూ టిజిఆర్‌పిడిసిఎల్ ఏర్పాటు చేశారు.
అందరూ అనుభవం ఉన్న అధికారులు, ఉద్యోగులే... రోజూ చేస్తున్న పనులే కనుక కొత్త డిస్కం ఏర్పాటు, నిర్వహణకు చకాచకా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కొత్త డిస్కం టిజిఆర్‌పిడిసిఎల్ ప్రారంభోత్సవం జరుగబోతున్నట్లు తెలుస్తోంది.