తెలంగాణ నిరుద్యోగులకు ఓ శుభవార్త! ప్రభుత్వోద్యోగాలకు వయో పరిమితిని 43 నుంచి 44 ఏళ్ళకు పెంచుతూ మంగళవారం జీవో జారీ చేసింది. ఈ ఉత్తర్వులు పోలీసులు వంటి యూనిఫారం సర్వీసస్‌కు వర్తించదని స్పష్టం చేసింది. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం తొలిసారిగా ప్రభుత్వోద్యోగాలకు వయో పరిమితిని 43కి పెంచారు. ఆ ఉత్తర్వులు 10 ఏళ్ళపాటు అంటే 2024 వరకు అమలులో ఉన్నాయి. ఆ జీవో కాల పరిమితి ముగిసిపోవడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దానిని మరో రెండేళ్ళకు పొడిగించిది. నిరుద్యోగుల అభ్యర్ధన మేరకు మళ్ళీ ఇప్పుడు మరో ఏడాది పాటు పొడిగిస్తూనే వయోపరిమిని కూడా 44 ఏళ్ళకు పెంచడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.