హైదరాబాద్ నగరవాసులకు జిహెచ్‌ఎంసి ఒక కొత్త సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. మీ సేవా కేంద్రాలలో పొందుతున్న తొమ్మిది రకాల సేవలను ఇకపై వాట్సప్ మొబైల్ యాప్ ద్వారానే పొందవచ్చు. దీని కోసం జిహెచ్‌ఎంసి ‘వాట్సప్ మీ సేవ’ పేరుతో ఒక మొబైల్ యాప్ ప్రారంభించింది.
దీని కోసం ముందుగా మీ మొబైల్ ఫోన్లో 80969 58096 నంబరుని ‘మీ సేవ తెలంగాణ’ అనే పేరుతో సేవ్ చేసుకోవాలి. తర్వాత వాట్సప్‌లో ‘హాయ్’ అనే మెసేజ్ పంపాలి. అప్పుడు దానిలో మెనూ వస్తుంది. దానిలో నుంచి మీరు అవసరమైన సేవ ఎంచుకొని ‘ఓపెన్ సర్వీస్’ అనే బటన్ క్లిక్ చేస్తే దరఖాస్తు కనిపిస్తుంది. దానిలో వివరాలు నింపిన తర్వాత ఎంత రుసుము చెల్లించాలో సూచిస్తుంది. అది చెల్లిస్తే మీరు కోరుకున్న సేవలు లభిస్తాయి.
ముందుగా బర్త్ సర్టిఫికెట్స్, ఇంటి వద్ద జనన మరణ ధృవీకరణ పత్రాలు, ఆస్తిపన్ను సవరణ, ఇంటి నంబర్ సవరణ, మ్యుటేషన్, ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ తదితర సేవలు పొందవచ్చు. అలాగే ట్రాఫిక్ చలానా, విద్యుత్ బిల్లులు చెల్లింపులు చేయవచ్చు.