ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న యాక్షన్ చిత్రం ‘డ్రాగన్’ ఫస్ట్ గ్లిమ్స్ ముహూర్తం ఫిక్స్ అయ్యింది.
రేపు బుధవారం జూ.ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మంగళవారం అర్దరాత్రి 11.52 నిమిషాలకు డ్రాగన్ ఫస్ట్ గ్లిమ్స్ విడుదల కాబోతోందని మైత్రీ మూవీ మేకర్స్ తెలియజేసింది. ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్‌కి జోడీగా కన్నడ నటి రుక్మిణీ వసంత్ నటిస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: రవి బస్రూర్, కెమెరా: భువన గౌడ, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరి కృష్ణ కొసరాజు కలిసి పాన్ ఇండియా మూవీగా డ్రాగన్ తెరకెక్కిస్తున్నారు. 2027, జూన్ 11న డ్రాగన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.